ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్ చికిత్సకు అనుమతి లేకున్నా వైద్యం..

గుంటూరు జిల్లా నరసరావుపేటలోని అంజిరెడ్డి ఆస్పత్రిపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. కొవిడ్ చికిత్సకు అనుమతి లేకున్నా వైద్యం అందించి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకూ 32 మంది కరోనా రోగులకు ఇక్కడ చికిత్స అందించగా ఒకరు మృతిచెందారు.

Vigilence_Raids
Vigilence_Raids

By

Published : May 14, 2021, 9:46 AM IST

గుంటూరు జిల్లా నరసరావుపేటలోని అంజిరెడ్డి ఆస్పత్రిలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఓ బాధితుడి నుంచి 5 రోజుల వైద్యానికి రూ.3.38 లక్షలు వసూలు చేసినట్లు ఫిర్యాదు అందుకున్న విజిలెన్సు అధికారులు విచారణ జరిపి నిర్ధరించారు. కొవిడ్ వైద్యచికిత్సలకు రెమిడెసివర్ ఇంజెక్షన్ల కోసం అదనంగా బాధితుడి నుంచి ఎక్కువగా వసూలు చేసినట్లు విజిలెన్స్​ ఎస్పీ జాషువా వెల్లడించారు.

ఈ ఆసుపత్రికి కొవిడ్ వైద్యచికిత్సలకు అనుమతి లేదని విజిలెన్స్​ ఎస్పీ స్పష్టం చేశారు. పిడుగురాళ్లలో ఇదే ఆస్పత్రిలో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఈ నెల 5న కేసు నమోదు కాగా.. అసలు అనుమతి లేకుండా నరసరావుపేటలోనూ కొవిడ్ రోగులకు వైద్యచికిత్సలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇంత వరకు ఈ ఆస్పత్రిలో 32 మంది రోగులకు చికిత్సలు చేశారని.. ఓ రోగి మృతి చెందినట్లు తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం సంబంధిత శాఖ అధికారులకు సమాచారం అందిస్తామన్నారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో కొత్తగా 22,399 కరోనా కేసులు... 89 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details