ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు కోడెల వర్ధంతి.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలన్న పోలీసులు - ఏపీ తొలి మాజీ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాదరావు వర్ధంతి వేడుకలు

మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు వర్ధంతిని.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలని.. తెదేపా నేతలకు పోలీసులు సూచించారు.

dsp veera reddy
నరసరావుపేట డీఎస్పీ వీరారెడ్డి

By

Published : Sep 16, 2020, 8:45 AM IST

నేడు మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు మొదటి వర్థంతి. ఈ కార్యక్రమాన్ని కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని పోలీసులు.. కోడెల తనయుడికి నోటీసులు ఇచ్చారు. కేంద్రం విధించిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి కాబట్టే.. నోటీసు ఇచ్చాము తప్ప.. కార్యక్రమాలు నిర్వహించుకోవద్దని తాము చెప్పలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కొందరు వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

కేన్సర్ ఆసుపత్రి సౌజన్యంతో నిర్వహించే రక్తదాన శిబిరాన్ని... కోడెల ఇంటి వద్దే ఏర్పాటు చేస్తామని ఆయన తనయుడు తెలిపారన్నారు. కాబట్టి ఆ కార్యక్రమానికి అనుమతి ఇచ్చామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో అన్నదాన కార్యక్రమాలకు కోవిడ్ ప్రభావం దృష్ట్యా అనుమతిలేదన్నారు. ఇది గమనించి వారి కుటుంబసభ్యులు, అభిమానులు సహకరించాలని నరసరావుపేట డీఎస్పీ వీరారెడ్డి కోరారు.

ABOUT THE AUTHOR

...view details