ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఏపీలో నివసించే నిర్మాతలకే స్టూడియో భూములను కేటాయించాలి' - guntur latest news

మా ఏపీ - ఏపీ ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ తెనాలిలో సమావేశం నిర్వహించింది. సినిమా స్టూడియోల కోసం విశాఖలో కేటాయించిన భూమిని రాష్ట్రంలో నివసించే వారికి మాత్రమే ఇవ్వాలని అధ్యక్షుడు అంబటి మధుమోహన్ కృష్ణ అన్నారు. కాగితాలకే పరితమైన జీవోలను ప్రభుత్వం కార్యరూపం దాల్చేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ap film chambar  of commerce  meet in tenali guntur
'ఏపీలో నివసించే నిర్మాతలకే స్టూడియో భూములను కేటాయించాలి'

By

Published : Nov 5, 2020, 11:04 PM IST

సినిమా స్టూడియో కోసం విశాఖలో కేటాయించిన 300 ఎకరాల భూమిని ఎపీలో నివసించే నిర్మాతలకు మాత్రమే ఇవ్వాలని ఏపీ ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షుడు అంబటి మధుమోహన్ కృష్ణ కోరారు. సినిమా షూటింగ్​ల అంశంపై పలువురితో ఆయన తెనాలిలో సమావేశం నిర్వహించారు.

కాగితాలకే పరితమైన జీవోలను కార్యరూపం దాల్చేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కేవలం15 సినిమాలకే సబ్సిడీని పరిమితం చేయాలనుకోవడం సముచితం కాదని వివరించారు. సబ్సిడీని రూ.10 లక్షల నుంచి 50 లక్షలకు పెంచాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details