నడికుడి మార్కెట్ యార్డులో సీసీఐ కేంద్రం ద్వారా పత్తి కొనుగోలు చేయాలని కోరుతూ ఏపీ రైతు సంఘం గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు డిమాండ్ చేశారు. పిడుగురాళ్ల మార్కెట్ యార్డు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. యార్డు ఛైర్మన్ గఫార్కు వినతిపత్రం సమర్పించారు.
'రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం గాలికొదిలేసింది' - నడికుడిలో సీసీఐ కేంద్రాలు
ఏటా గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని నడికుడి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసే సీసీఐ కేంద్రాన్ని.. ప్రైవేట్ మిల్లులో తెరవడంపై ఏపీ రైతు సంఘం మండిపడింది. రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం గాలి కొదిలేసిందని.. ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
!['రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం గాలికొదిలేసింది' cci installation in nadikudi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9615538-537-9615538-1605951198334.jpg)
ఎన్నడూ లేనివిధంగా.. సీసీఐ కేంద్రాలను ఈ ఏడాది ప్రైవేటు స్పిన్నింగ్ మిల్లుల్లో తెరవడాన్ని గోపాలరావు ఖండించారు. పిడుగురాళ్ల చుట్టుపక్కల అన్ని యార్డులలో తెరిచి.. ఇక్కడ మాత్రం ప్రైవేటు మిల్లులకు అప్పగించడంపై మండిపడ్డారు. రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు. గతంలో ఆందోళన నిర్వహించి అధికారులకు విషయం తెలిపినా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. స్థానిక శాసనసభ్యులను సంప్రదించి సీసీఐ కేంద్రాన్ని యార్డులోనే తెరిచే విధంగా చర్యలు తీసుకుంటామని.. యార్డు ఛైర్మన్ గఫార్ వెల్లడించారు.
ఇదీ చదవండి:నడికుడి ఎస్బీఐలో భారీ చోరీ