డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు వివిధ స్వచ్ఛంద సంస్థల మహిళలు, చిన్నారులు రాఖీ కట్టారు. చిన్నారులను ఆప్యాయంగా పలకరించి, వారితో రాఖీ కట్టించుకున్నారు. రాష్ట్రంలో మహిళలకు అండగా ఉంటామన్న ఆయన త్వరలోనే మహిళల రక్షణకు మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమాజంలో అన్నివర్గాలకు పోలీసులు అండగా ఉంటారనీ, మహిళలు సైతం ధైర్యంగా పోలీసు స్టేషన్లకు వచ్చి స్వేచ్ఛగా ఫిర్యాదు చేసే వాతావరణాన్ని కల్పించామని తెలిపారు.
మహిళల రక్షణకు పెద్దపీట: డీజీపీ సవాంగ్
మహిళల రక్షణకు పెద్దపీట కల్పిస్తున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. మహిళలు పోలీస్ స్టేషన్‌కు వచ్చి స్వేచ్ఛగా ఫిర్యాదు చేసే వాతావరణం కల్పించామని చెప్పారు.
'సమాజంలో అన్ని వర్గాలకు పోలీసుల అండ ఉంటుంది'