ఏసీఏ మైదానంలో క్రికెట్ మ్యాచ్... హైకోర్టు చీఫ్ జస్టిస్ లెవెన్ జట్టు విజయం - ఏసీఏ మైదానంలో క్రికెట్ మ్యాచ్ పోరు
గుంటూరు జిల్లా నవులూరులో ఏసీఏ మైదానంలో న్యాయవిభాగం ఆధ్వర్యంలో క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఈ పోరులో హైకోర్టు అడ్వకేట్ అసోషియేషన్ జట్టుపై హైకోర్టు చీఫ్ జస్టిస్ లెవెన్ జట్టు విజయం సాధించింది.

గుంటూరు జిల్లా నవులూరులో ఏసీఏ మైదానంలో జరిగిన మ్యాచ్ లో హైకోర్టు అడ్వకేట్ అసోషియేషన్ జట్టుపై హైకోర్టు చీఫ్ జస్టిస్ లెవెన్ జట్టు విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైకోర్ట్ అడ్వకేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లెవన్ జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 104 పరుగులు సాధించింది. అనంతరం 105 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన హైకోర్టు చీఫ్ జస్టిస్ లెవెన్ జట్టు 10.2 ఓవర్లలోనే విజయలక్ష్యాన్ని ఛేదించింది. హైకోర్టు న్యాయవాది మజ్జి సూరిబాబు మ్యాచ్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించగా... అంపైర్లుగా ఎన్.వెంకట్రావు, జి.తిరుమలరావు బాధ్యతలు నిర్వహించారు. విజేతలకు హైకోర్ట్ చీఫ్ జస్టిస్ జె.కె. మహేశ్వరి ట్రోఫీలను అందజేశారు.