AP Debts: ఏపీ అప్పులు రూ.4.42 లక్షల కోట్లు: కేంద్రం - total debt of andhra pradesh
20:29 July 24
2019 మార్చి నాటికి ఏపీ అప్పులు రూ.2.64 లక్షల కోట్లు: కేంద్రం
AP Debts: లోక్‌సభలో తెలంగాణ భారాస ఎంపీ నామ నాగేశ్వరరావు రాష్ట్రాల అప్పులపై అడిగిన ప్రశ్నకు కేంద్రం ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేషన్లు తీసుకున్న అప్పుల వివరాలను కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది. 2019-20 నుంచి 2022-23 వరకు ఆంధ్రప్రదేశ్ తీసుకున్న అప్పుల వివరాలను తెలిపింది. 2019 మార్చి నాటికి ఏపీ అప్పులు రూ.2.64 లక్షల కోట్లు ఉన్నాయని, 2023 మార్చి నాటికి రాష్ట్ర అప్పులు రూ.4.42 లక్షల కోట్లు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వకంగా తెలియజేశారు.
2019 నుంచి 2023 వరకు ఆంధ్రప్రదేశ్ తీసుకున్న అప్పుల వివరాలు:
- 2019 మార్చి నాటికి రూ. 2,64,451 కోట్లు
- 2020 మార్చి నాటికి.. రూ. 3,07,672 కోట్లు
- 2021 మార్చి నాటికి.. రూ. 3,53,021 కోట్లు
- 2022 మార్చి నాటికి.. రూ. 3,93,718 కోట్లు
- 2023 మార్చి నాటికి బడ్జెట్ అంచనాల ప్రకారం రూ. 4,42,442 కోట్లు
రాష్ట్ర కార్పొరేషన్ల వారీగా తీసుకున్న అప్పుల వివరాలు :
- రాష్ట్ర వాటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పేరుతో... 2019-20లో రూ. 1931 కోట్లు
- రోడ్డు అభివృద్ది కార్పొరేషన్ పేరుతో.. 2020-21లో రూ. 1158.53 కోట్లు
- ఫిషరీస్ అండ్ అక్వాకల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ నుంచి 2022-23లో రూ. 450కోట్లు
- వేర్ హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి 2019-20లో రూ. 11.40కోట్లు
- మైక్రో ఇరిగేషన్ ఫండ్ నుంచి 2020-21లో రూ. 616.13 కోట్లు
- రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ నుంచి... 2019-20 నుంచి 2022-23 వరకు రూ. 6,212 కోట్లు
- క్రెడిట్ ఫెసిలిటీ ఫెడరేషన్స్ నుంచి APSCSCl 2019-20 నుంచి 2022-23 వరకు రూ. 24,311 కోట్లు, ఏపీ సీడ్స్ రూ. 400 కోట్లు అప్పులు తీసుకుంది.