ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP Debts Crossing Limits: పరిమితికి మించిన అప్పుల్లో ఆంధ్ర.. అస్తవ్యస్థంగా ఆర్థిక పరిస్థితి.. అయినా తగ్గేదేలే అంటున్న జగన్ సర్కార్ - No Salaries For Teachers

AP Debts Crossing Limits: అప్పు పుట్టనిదే.. పూట గడవని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్‌ కొట్టుమిట్టాడుతోంది. ఓవర్ డ్రాఫ్ట్‌ పరిమితి కూడా మించిపోవడంతో.. జీతాలు, పెన్షన్లు కూడా చెల్లించలేని దుస్థితి నెలకొంది. పదో తేదీ వచ్చినా పెన్షన్లు జమ కాకపోవడంతో.. ప్రభుత్వ పెన్షనర్లు లబోదిబోమంటున్నారు.

AP_Debts_Crossing_Limits
AP_Debts_Crossing_Limits

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 10, 2023, 9:53 AM IST

AP Debts Crossing Limits: పరిమితికి మించిన అప్పుల్లో ఆంధ్ర.. అస్తవ్యస్థంగా ఆర్థిక పరిస్థితి.. అయినా తగ్గేదేలే అంటున్న జగన్ సర్కార్

AP Debts Crossing Limits: ఓవైపు రిజర్వుబ్యాంకు రాష్ట్రాన్ని ఓవర్ డ్రాఫ్ట్ నుంచి బయట పడాలంటూ హెచ్చరిస్తుంటే.. మరోవైపు ఆర్థికశాఖ మరిన్ని అప్పుల కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పరిమితికి మించిఅప్పులు చేసింది. సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 7వ తేదీ వరకూ రాష్ట్ర ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్‌లోనే ఉంది.

Andhra Pradesh Financial Condition in Danger: రాష్ట్రం ప్రస్తుతం 2వేల229 కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్‌లో ఉంది. అక్టోబరు 17 నాటికి ఓడీ తుది గడువు ముగుస్తుంది. రాష్ట్రం ఓడీ నుంచి బయటపడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రిజర్వు బ్యాంకు జనరల్ మేనేజర్ నుంచి సోమవారం రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ అందింది.

No Salaries For Teachers : అప్పులు చేస్తూ.. అవస్థలు పడుతూ ! మూడు నెలలుగా వేతనాలు అందక ఉపాధ్యాయుల వెతలు..

Andhra Pradesh Debts Details: ఓడీ నిబంధనల ప్రకారం.. పరిస్థితులు విషమిస్తే ఆర్​బీఐ చెల్లింపులను కూడా నిలిపివేస్తూ ఉంటుంది. నెల ప్రారంభంలో జీతాలు, పెన్షన్లు, సామాజిక పెన్షన్లు చెల్లించాలి. కష్టపడి సామాజిక పెన్షన్లు చెల్లిస్తున్నారు. నెల మొదటి నుంచి ఓవర్ డ్రాఫ్ట్‌లోనే ఉండే పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు, పెన్షన్లకు కూడా అప్పులు చేసే పరిస్థితిలో ఉంటే ఇక అభివృద్ధి మాటేమిటి అనేది అంతుబట్టని ప్రశ్నగా మిగిలిపోతోంది.

YSRCP Govt Debts in AP: కేవలం పెన్షన్‌తోనే జీవితాలు వెళ్లదీసే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఎందరో ఫోన్లు చేసి పింఛను ఎప్పుడు వస్తుందని ప్రశ్నిస్తున్నట్లు.. పెన్షనర్ల చర్చావేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఈదర వీరయ్య తెలిపారు. దీనిపై ఆర్థికశాఖ అధికారులు స్పందించడం లేదని చెప్పారు. మంగళవారం రిజర్వుబ్యాంకు నిర్వహించే సెక్యూరిటీ వేలంలో పాల్గొని రాష్ట్రం 450 కోట్ల రూపాయలు మాత్రమే తీసుకునే వీలుంది.

YSRCP Government Continuously Runs with Debts: అప్పులు లేనిదే సాగని పాలన.. వైసీపీ ప్రభుత్వ అసమర్థ విధానాలతో రాష్ట్రంపై రుణాల మోత

AP Government Trying to Get More Debts: ఇప్పటికే కేంద్రం ఇచ్చిన నికర రుణ పరిమితి పరిధి దాటిపోవడం వల్ల అప్పులు పుట్టించడమూ ఆర్థికశాఖ అధికారులకు ఇబ్బందిగానే మారింది. ఇతర మార్గాలను వెతుకుతున్నారు. మరోవైపు.. ఉద్యోగుల వ్యవహారాలకు సంబంధించి ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఎన్.చంద్రశేఖర్రెడ్డి తాను ఆర్థికశాఖ కార్యదర్శితో మాట్లాడానని, మంగళవారం నాటికి వేతనాలు జమ చేస్తామని హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘ నాయకులకు సందేశం పంపారు.

Andhra Pradesh Financial Condition in Danger: రాష్ట్రంలో ప్రభుత్వ పెన్షనర్లకు ఇంకా వేయి కోట్ల రూపాయల వరకూ చెల్లించాల్సి ఉంది. జీతాల రూపంలో 700 కోట్ల రూపాయలు ఇవ్వాలని సమాచారం. బుధవారం అందే అప్పుతో పాటు కేంద్రం నుంచి వచ్చే పన్ను వాటాల సొమ్ము కోసం ఎదురుచూస్తున్నారు.

AP Debts Crossing Limits అప్పు ఆదాయంగా మారడంలేదు.. అప్పుగానే మిగిలిపోతోంది! ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం.. అయినా తగ్గేదేలే అంటున్న సర్కార్!

ABOUT THE AUTHOR

...view details