CID POLICE INVESTIGATION ON EX MINISTER NARAYANA : హైదరాబాద్‌లో మాజీ మంత్రి నారాయణను ఏపీ సీఐడీ అధికారులు విచారించారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో ఆయన వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేశారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో న్యాయవాదుల సమక్షంలో సీఐడీ అధికారులు నారాయణ వాంగ్మూలం తీసుకున్నారు.
హైకోర్టు ఆదేశాలతో మాజీ మంత్రి నారాయణ ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు - ap news updates
CID POLICE INVESTIGATE EX MINISTER NARAYANA : హైకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో మాజీ మంత్రి నారాయణను ఆంధ్రప్రదేశ్ సీఐడీ ఆధికారులు విచారించారు. రాజధాని ఇన్నర్ రింగ్‌రోడ్డు వ్యవహారంపై న్యాయవాదుల సమక్షంలో వాంగ్మూలం సేకరించారు.
ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో సీఐడి అధికారులు గతంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా.. సాక్షిగా విచారణకు రావాలంటూ నారాయణకు సీఐడీ అధికారులు 160 సీఆర్‌పీసీ నోటీసు ఇచ్చారు. అయితే, ఈ నోటీసుపై ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనారోగ్యంతో ఉన్నారని.. ఇటీవల శస్త్రచికిత్స జరిగిందని నారాయణ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆయనకు 65 ఏళ్ల వయసు దాటిందని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న న్యాయస్థానం.. నారాయణను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలోనే న్యాయవాది సమక్షంలో విచారించుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్ వచ్చి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు.