CID DIG Sunil Kumar: గుంటూరు జిల్లాలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి సీఐడీ డీజీ సునీల్ కుమార్ హాజరయ్యారు. కొంతమంది ప్రజా ప్రతినిధులు తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి సీఐడీపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర సీఐడీ కార్యాలయంలో నూతనంగా నియమించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లలతో ఆయన ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారికి కీలక సూచనలు చేశారు. ఆర్థిక నేరాలకు పాల్పడే వ్యక్తుల కేసుల విషయంలో నూతనంగా నియమించిన ఎస్పీపీలు సమర్థవంతంగా వాదనలు వినిపించాలని సూచించారు.
సీఐడీ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయంతో పనిచేయాలి: సీఐడీ డీజీ - సీఐడీ అధికారాలు
AP CID DIG Sunil Kumar: గుంటూరు జిల్లాలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి సీఐడీ డీజీ సునీల్ కుమార్ హాజరయ్యారు. అధికారులు సమర్ధవంతంగా పని చేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. సీఐడీలో నూతనంగా నియమించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లలతో సమావేశం సందర్భంగా సీఐడీ డీజీ సునీల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
AP CID DIG Sunil Kumar
సీఐడీ కేసుల విషయంలో న్యాయస్థానాలలో సహేతుకమైన ఆధారాలతో వాదించాలని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ సందర్భాల్లో దాదాపు 3000 మంది సైబర్ బుల్లింగ్ నేరాలకు పాల్పడే వారిని గుర్తించామన్నారు. సీఐడీ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయంతో పనిచేయాలన్నారు. అప్పుడే సరైన ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. సరైన ఆధారాలతో న్యాయస్థానాలలో వాదించినప్పుడే సైబర్ నేరాలు, ఆర్థిక నేరాలను నియంత్రించగలమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి: