ఈ నెల 11న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో 11వ తేదీ ఉదయం 11 గంటలకు సీఎం అధ్యక్షతన మంత్రులు సమావేశం కానున్నారు. భేటీలో చర్చించాల్సిన ప్రతిపాదిత అంశాలను పంపించాల్సిందిగా వివిధ శాఖలను సీఎస్ కార్యాలయం కోరింది. 9వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ప్రతిపాదిత అంశాలు పంపించాలని సూచించింది.
11న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం - ఏపీ ప్రభుత్వం వార్తలు
రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 11న ఉదయం సచివాలయంలో ఈ భేటీ జరగనుందని సమాచారం.
cm jagan