AP Cabinet Meeting: నాలుగు గంటలపాటు సమావేశమైన మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఆర్డీఏలోని ఆర్-5 జోన్ లో 47వేల ఇళ్ల నిర్మాణాలకు కేబినెట్ ఆమోదించింది. జూలై నెలలో చేపట్టే సంక్షేమ పథకాలు అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ స్పష్టంచేశారు. ఈ నెల 18న జగనన్న తోడు, 21న నేతన్న నేస్తం పథకాల అమలుకు ఆమోదించిందన్నారు. సీఅర్డీఏ పరిధిలోని ఇళ్ల నిర్మాణం కోసం జులై 24న పనులు ప్రారంభానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. సున్నా వడ్డీ కింద 1350 కోట్లు, జగనన్న విదేశీ విద్య తదితర పథకాల అమలుకు లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించినున్నట్లు మంత్రి వివరించారు.
భూమిలేని నిరుపేదలకు అసైన్డ్ భూమిపై ఆంక్షలు తొలగిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. 54 వేల ఎకరాల అసైన్డ్ భూములు, 9 వేల 62 ఎకరాల లంక భూములు రైతులకు పూర్తి హక్కులు కల్పిస్తూ కేబినెట్ ఆమోదించినట్లు మంత్రి తెలిపారు. 20 ఏళ్లుగా హక్కులు లేని అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తూ నిర్ణయించిన్నట్లు తెలిపారు. 1700 రెవెన్యూ గ్రామాల్లో 1050 ఎకరాల భూమి నీ శ్మశాన వాటికలకు ఇవ్వాలనీ నిర్ణయించామని, ఈ కేబినెట్ దళిత వర్గాలకు వరాలు కురిపించిందని మంత్రి తెలిపారు. ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కింద ఉన్న భూమికి రిజిస్ట్రేషన్ చార్జీలను మినహాయిస్తున్నట్లు తెలిపారు. 22ఏలో ఉన్న ఇనాం భూములకు విషయంలోనూ హక్కులు కల్పించేందుకు కేబినెట్ ఆమోదించిందన్నట్లు మంత్రి తెలిపారు. విశ్వ విద్యాలయాల్లో బోధనా సిబ్బందికి ఉద్యోగ విరమణ వయసు 63 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ ఆమోదించిందని మంత్రి వివరించారు.