ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీలో సమగ్ర కులగణనతో పాటు పలు కీలక నిర్ణయాలకు మంత్రి వర్గ సమావేశం ఆమోదం - AP Cabinet Meeting

AP Cabinet Meeting Decisions: కేబినెట్ ఆమోదం తెలిపింది. సామాజిక, ఆర్థిక అంశాలపై ఈ గణన జరపాలని నిర్ణయించింది. పరిశ్రమల ఏర్పాటుకు ఎస్ఐపీబీలో తీసుకున్న నిర్ణయాలను కేబినెట్ ఆమోదించింది. నవంబర్‌లో సంక్షేమ క్యాలెండర్ అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు.

AP_Cabinet_Meeting_Decisions
AP_Cabinet_Meeting_Decisions

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 3, 2023, 10:29 PM IST

AP Cabinet Meeting Decisions: నవంబర్ నెలలో సంక్షేమ క్యాలండర్ అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ (Chellaboina Venugopal Krishna) తెలిపారు. రైతు భరోసా ఆర్థిక సాయం, అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించే అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్​లో ధాన్యం సేకరణ కోసం పౌరసరఫరాల కార్పొరేషన్​కు 5 వేల కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతి ఇచ్చిందని వెల్లడించారు. పరిశ్రమల ఏర్పాటుకు ఎస్ఐపీబీలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదించింది.

రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు భవనాల శాఖ అతిథి గృహాల్లో 467 అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. తూర్పు గోదావరి, సత్య సాయి జిల్లాల్లో ఒక్కొక్క రవాణా శాఖ యూనిట్​లు ఏర్పాటుకు ఆమోదం తెలిపిందన్నారు. ఆరోగ్య సురక్షలో భాగంగా 11 వేల 700 ఆరోగ్య క్యాంపులు నిర్వహించగా, 60 లక్షల మంది వైద్య శిబిరాలకు వచ్చారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య శ్రీ యాప్ డౌన్ లోడ్ చేసుకునేలా నిర్ణయం తీసుకున్నారు.

Minister Chelluboina Venugopal on BC Caste Enumeration: నవంబర్ 15 నుంచి బీసీల కులగణన ప్రారంభం: మంత్రి వేణుగోపాల్

6 వేల 790 ప్రభుత్వ హై స్కూల్​లో సాంకేతిక నైపుణ్యత కోసం ఇంజినీరింగ్ కళాశాలతో మ్యాపింగ్​కు మంత్రివర్గం నిర్ణయించింది. విద్యుత్ బస్సులు, ట్రక్కుల తయారీ సంస్థ పెప్పర్ మోషన్ (Pepper Motion) సంస్థకు చిత్తూరు జిల్లాలో భూ కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రీన్ హైడ్రోజెన్ హబ్ ఏర్పాటుకు ఎన్టీపీసీకి కేబినెట్‌ అనుమతి ఇచ్చిందన్నారు.

అదే విధంగా క్రీడాకారుడు సాకేత్ మైనేనికి గ్రూప్ 1 ఉద్యోగం (Group 1 Job to Tennis Player Saketh Myneni) ఇచ్చేందుకు మంత్రి వర్గం అంగీకారం తెలిపిందన్నారు. ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు (Ferro Alloy Industries) విద్యుత్ డ్యూటీని 1 రూపాయి నుంచి ఆరు పైసలకు తగ్గిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

Changes In GPS Bill జీపీఎస్ బిల్లులో మళ్లీ మార్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం...

AP Begin Caste Census After November 20: 92 ఏళ్ల తరవాత ఏపీలో సమగ్ర కులగణనకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. సామాజిక, ఆర్థిక అంశాలపై ఈ గణన చేసేలా మంత్రి వర్గం అనుమతి ఇచ్చిందన్నారు. నవంబర్ 20 తేదీ తరవాత కార్యక్రమం చేపట్టేందుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.

Houses to Journalists in AP: కర్నూలులో పవన విద్యుత్, కడప, నంద్యాలలో సౌర విద్యుత్ యూనిట్​ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలియజేసిందని తెలిపారు. ఏపీలో 6 జోన్లుగా ఉద్యోగ కేడర్ నియామకానికి కేబినెట్ అనుమతి ఇచ్చింది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కేబినెట్ అంగీకారం తెలిపిందని మంత్రి స్పష్టం చేశారు.

Cabinet Approves Fertilisers Subsidy : రైతులకు శుభవార్త.. ఎరువులపై రూ.22,303 కోట్ల సబ్సిడీకి కేంద్ర కేబినెట్ ఆమోదం

AP Cabinet Meeting Decisions: ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం

ABOUT THE AUTHOR

...view details