ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనుష్క పంటచేలకొచ్చింది... ఎందుకబ్బా! - arundhathi

'ఏడవకురా.. అప్పు చేసి కొన్నాను'... తరుచుగా ఈ డైలాగ్​ వాహనాలపై కన్పిస్తుంది. కానీ ఓ రైతు ఇంకో అడుగు ముందుకేసి ముద్దుగుమ్మల బొమ్మలతో పంట పొలాల్లో ఫ్లెక్సీలు అమర్చాడు. ఇదేంటని అడిగితే..' అటొచ్చే వాళ్లంతా... వాటివైపే చూస్తారు... దిష్టి తలగదు కదా!'అని వ్యంగంగా..సమాధానమిస్తున్నాడు.

అనుష్క పంటచేలకొచ్చింది... ఎందుకబ్బా!

By

Published : Aug 16, 2019, 5:24 AM IST

దొండసాగులో అనుష్క ఫ్లెక్సీ పెట్టాడెందుకు..!

హీరోయిన్​ అనుష్క గుంటూరు జిల్లా పంటపొలాల్లో కనపడుతోంది. కొంపదీసి వ్యవసాయం చేస్తుందనుకునేరు. ఫ్లెక్సీల రూపంలో పంటకు దిష్టి తలక్కుండా కాపలకాస్తోంది. పెదలంక గ్రామానికి చెందిన ఓ రైతు... ఆ ఫొటోల కింద తనదైన రీతిలో డైలాగ్స్​ రాయించి చూపరుల్నీ ఆశ్చర్య పరిచాడు. 'ఏడవకురా..అప్పుచేసి వేశాను..'అంటూ హస్యస్పదంగా ప్రింట్​ చేయించాడు. అదేంటని ప్రశ్నిస్తే 'ఆమెవరో కూడా తెలీదు..దారిలో పోయే వాళ్లు ఆ ఫ్లెక్సినే చూస్తారు కదా..దొండసాగుకు దిష్టి తలగదు..'అంటూ అమాయకంగా సమాధానమిస్తున్నాడు. బెల్లంకొండ మండలం వెంకటపాలెంలోనూ.. ఓ రైతు ఇలాగే పత్తిపంటలో సినీనటి చిత్రాన్ని ఏర్పాటు చేశాడు. ఇదీ ఓ రకం రక్షణే మరి..!

ABOUT THE AUTHOR

...view details