ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని దూర విద్యా కేంద్రం నిర్వహిస్తున్న గీతాంజలి కళాశాల పరీక్షా కేంద్రాన్ని అధికారులు రద్దు చేశారు. యూజీ, పీజీ దూర విద్య పరీక్షల్లో ఈ కళాశాల యాజమాన్యం అవకతవకలకు పాల్పడిందనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో చర్యలకు ఉపక్రమించారు. ఆ సంస్థతో సంబంధం ఉన్న ఇతర పరీక్షా కేంద్రాలపైనా ఇదే తరహా చర్యలు తీసుకుంటామని దూర విద్యా కేంద్రం సంచాలకులు సుమంత్ కుమార్ వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని బాలానగర్‌లోని గాంధీనగర్‌లో కేంబ్రిడ్జ్ జూనియర్ కళాశాలకు పరీక్షా కేంద్రాన్ని మార్చామన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి కమిటీని నియమించబోతున్నట్లు సుమంత్ కుమార్ తెలిపారు.
'గీతాంజలీ పరీక్షా కేంద్రాన్ని రద్దు చేసిన ఏఎన్‌యూ' - ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తాజా న్యూస్
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని దూర విద్యా కేంద్రం నిర్వహిస్తున్న యూజీ, పీజీ పరీక్షలలో హైదరాబాద్‌కు చెందిన గీతాంజలి కళాశాలపై అధికారులు చర్యలు ప్రారంభించారు. ఈ పరీక్షా కేంద్రాన్ని రద్దు చేస్తున్నట్లు దూర విద్యా కేంద్రం సంచాలకులు సుమంత్ కుమార్ వెల్లడించారు. కాగా పరీక్షా కేంద్రంలో దూర విద్యా పరీక్షల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వచ్చాయి.
గీతాంజలీ పరక్షా కేంద్రాన్ని రద్దు చేసిన ఏఎన్‌యూ