ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ర్యాగింగ్‌ దోషులకు ఉరి తప్ప అన్నీ శిక్షలూ వర్తిస్తాయి' - program

ఏఎన్‌యూలో యాంటీ ర్యాగింగ్‌ అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి హైకోర్టు న్యాయసేవ కమిటీ ఛైర్మన్‌ ఏవీ శేషసాయి హాజరయ్యారు. విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని ఆయన సూచించారు.

anti-ragging-program

By

Published : Jul 20, 2019, 9:23 AM IST

ఏఎన్‌యూలో యాంటీ ర్యాగింగ్‌ అవగాహన సదస్సు

ర్యాగింగ్‌ చేసినవారికి ఉరి తప్ప అన్ని శిక్షలూ వర్తిస్తాయని హైకోర్టు న్యాయసేవా కమిటీ ఛైర్మన్‌ జస్టిస్‌ ఏవీ శేషసాయి తెలిపారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో.... రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయసేవ కమిటీ, అఖిల భారత న్యాయవాదుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో యాంటీ ర్యాగింగ్‌ సదస్సు జరిగింది. దీనికి హాజరైన జస్టిస్‌ ఏవీ శేషసాయి.... విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కేసుల్లో శిక్ష పడితే ఇక ఏ కళాశాలలోనూ చదివే అవకాశం ఉండదని హెచ్చరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details