ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫిరంగిపురం రోడ్డు ప్రమాదంలో మరొకరు మృతి

గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. కారు-అంబులెన్స్ ఢీకొన్న ఘటనలో అంబులెన్స్​లో ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందగా.. నేడు కారులోని వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు.

Firangipuram Road accident
ఫిరంగిపురంలో రోడ్డు ప్రమాదం

By

Published : May 30, 2021, 5:50 PM IST

గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో నిన్న కారు-అంబులెన్స్ ఢీకొన్న ఘటనలో మరొకరు మృతి చెందారు. ఈపూరికి చెందిన పూర్ణచంద్రరావు కరోనాతో గుంటూరులో మృతి చెందారు. ఈ క్రమంలో అతని మృతదేహాన్ని అంబులెన్స్​లో స్వస్థలానికి తరలింస్తుండగా.. గుంటూరు వైపుగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్​లోని కోటేశ్వరరావును ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు గాయపడగా.. ఈరోజూ వారిలో ఒకరు చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు. మృతుడు గుంటూరుకు చెందిన మహాలక్ష్మయ్య అని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details