ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుండెపోటుతో.. అమరావతి రైతు మృతి - గుంటూరు జిల్లా తాజా వార్తలు

అమరావతి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న మరో రైతు ప్రాణాలు కోల్పోయారు. తుళ్లూరు మండలం ఐనవోలుకు చెందిన యారగోపు రామచంద్రరావు... ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు.

అమరావతి రైతు ఉద్యమంలో మరో రైతు మృతి
అమరావతి రైతు ఉద్యమంలో మరో రైతు మృతి

By

Published : May 23, 2021, 10:44 AM IST

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఐనవోలుకు చెందిన రైతు యారగోపు రామచంద్రరావు ఆదివారం ఉదయం గుండె పోటుతో మృతి చెందారు. ఆయన అమరావతి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.

రాజధాని నిర్మాణానికి 2 ఎకరాల 50 సెంట్ల భూమిని రామచంద్రరావు ఇచ్చినట్టు కుటుంబీకులు చెప్పారు. 3 రాజధానుల ప్రకటన వచ్చిన దగ్గరనుంచి నిత్యం ఐనవోలులో ఉద్యమంలో పాల్గొన్నారని రైతులు తెలిపారు. అమరావతి తరలిపోతుందేమోనని రోజు బాధ పడేవారని గుర్తు చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details