Case against MLA Raja Singh :తెలంగాణలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదైంది. మంగళహాట్ పీఎస్‌లో రాజాసింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 6న ట్విటర్లో రాజాసింగ్ అయోధ్యపై పోస్టు చేశారు. ఈ వ్యాఖ్యలపై సంజాయిషీ ఇవ్వాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. హైకోర్టు షరతులను ఉల్లంఘించారని అందులో పేర్కొన్నారు. ఈ నోటీసులకు రాజాసింగ్ తరఫు న్యాయవాది సంజాయిషీ ఇచ్చారు. అయితే నోటీసుల్లోని అంశాలు సంతృప్తికరంగా లేవని పోలీసులు చెప్పారు.
ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదు - Hyderabad Latest News
Case against BJP MLA Raja Singh: తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదైంది. మంగళహాట్ పీఎస్‌లో రాజాసింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 6న ట్విటర్లో రాజాసింగ్ అయోధ్యపై పోస్టు చేశారు. ఈ వ్యాఖ్యలపై సంజాయిషీ ఇవ్వాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు.
Case against BJP MLA Raja Singh
తనపై పోలీసులు కేసు నమోదు చేయడంపై రాజాసింగ్ స్పందించారు. బాబ్రీ మసీదుపై ఒవైసీ సోదరులు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని చెప్పారు. వాళ్లపై ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. అధికారుల మెప్పు పొందేందుకే తనపై కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. కావాలనే తెలంగాణ పోలీసులు తనపై కక్ష కడుతున్నారని ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు.
ఇవీ చదవండి: