ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కొమ్మూరులో వీరభద్ర స్వామి వార్షికోత్సవం

By

Published : Feb 17, 2021, 9:44 AM IST

గుంటూరు జిల్లా కొమ్మూరులో భద్రకాళీ సమేత వీరభద్ర స్వామికి కల్యాణ మహోత్సవంలో పంచామృతాభిషేకలు జరిపారు. మహిళలు కుడుములలో జ్యోతులు వెలిగించుకుని పళ్లెర వేడుకల్లో పాల్గొన్నారు.

Anniversary of Veerabhadra Swamy in Kommur
కొమ్మూరులో వీరభద్ర స్వామి వార్షికోత్సవం

గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరులో భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారికి కల్యాణ మహోత్సవంలో పంచామృతాభిషేకలు జరిపారు. స్వామి వారి మూల విరాట్ ఎదుట బియ్యం కొలిచి అనకట్ట కట్టారు. 4 గంటల తర్వాత ఆ బియ్యాన్ని కొలిచారు. కళాకారులు గణపతి, శివుడు, నరసింహ స్వామి, సాయిబాబా, కాళీమాతా వేషధారణలతో చేసిన నృత్యాలు అలరించాయి.

మహిళలు కుడుములలో జ్యోతులు వెలిగించుకుని పళ్లెర వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు నోటిలో నారసాల గుచ్చికుని ఆలయంలో ప్రదక్షిణలు చేశారు.


ఇవీ చూడండి : నేడు మూడో దశ పంచాయతీ ఎన్నికలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details