గుంటూరు జిల్లాలోని తుళ్లూరులో భూబదలాయింపు ఆరోపణలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ ముగించింది. తుళ్లూరు మండలం విశ్రాంత తహసీల్దార్ అన్నె సుధీర్‌బాబు పిటిషన్‌ను కొన్ని రోజుల క్రితం హైకోర్టు కొట్టివేసిందని ప్రభుత్వ న్యాయవాది సర్వోన్నత న్యాయస్థానానికి వివరించారు. హైకోర్టు తుది నిర్ణయంతో ప్రభుత్వ పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు బుధవారం ముగించింది.
జరిగింది ఇదే..
తుళ్లూరు విశ్రాంత తహసీల్దార్ అన్నె సుధీర్ బాబుపై సీఐడీ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. అయితే దీన్ని తప్పుపట్టిన రాష్ట్ర హైకోర్టు గతంలో స్టే విధించింది. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ అంశంలో విచారణ త్వరగా ముగించాలని హైకోర్టును కొన్ని రోజుల క్రితం సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఈ క్రమంలో తుళ్లూరు మండలం విశ్రాంత తహసీల్దార్ అన్నె సుధీర్‌బాబు పిటిషన్‌ను కొన్ని రోజుల క్రితం హైకోర్టు కొట్టివేసింది. సీఐడీ నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగించాల్సిందే హైకోర్టు చెప్పింది. దీంతో ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు ముగించింది.
ఇదీ చదవండి
తుళ్లూరు విశ్రాంత తహసీల్దార్ సుధీర్ బాబు పిటిషన్ కొట్టివేత