అన్నమయ్య జిల్లా రామచంద్రాపురానికి చెందిన శివారెడ్డి.. తనకు న్యాయం చేయాలంటూ వైకాపా ప్లీనరీకి వచ్చారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో సర్వం కోల్పోయానని.. సీఎం జగన్ న్యాయం చేయాలంటూ ప్లకార్డు ప్రదర్శించారు. తనకు న్యాయం చేయాల్సిందిగా ప్లీనరీ వద్ద వేడుకున్నాడు. అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 3 ఎకరాల పొలం, ఇంటిస్థలం, డబ్బులు, బంగారం మొత్తం వరద నీటిలో కొట్టుకుపోయిందని కన్నీటి పర్యంతమయ్యాడు. సాయం చేస్తామని హామీలిచ్చిన నేతలెవ్వరూ పట్టించుకోవడం లేదన్నారు. అయితే.. సాయం కోసం సీఎం జగన్‌ను కలిసేందుకు ప్లీనరీ వద్దకు వచ్చినా.. ఫలితం దక్కలేదు.
'వరదల్లో సర్వం కోల్పోయాం జగనన్న.. సాయం చేయండి' - అన్నమయ్య ప్రాజెక్టు నిర్వాసితుడు శివారెడ్డి
అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో సర్వం కోల్పోయిన నిర్వాసితుడు శివారెడ్డి.. వైకాపా ప్లీనరీకి తరలివచ్చారు. వరదల్లో సర్వం కోల్పోయి రోడ్డునపడ్డానని.. సీఎం జగన్ న్యాయం చేయాలంటూ ప్లకార్డు ప్రదర్శించారు.
అన్నమయ్య ప్రాజెక్టు నిర్వాసితుడు శివారెడ్డి