ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణాయపాలెంలో అరెస్టయిన రైతులను పరామర్శించిన అనిత - జై అమరావతి అంటూ నినాదం

రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామని ప్రకటన వచ్చేంతవరకూ ఉద్యమం కొనసాగుతుందని... తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్పష్టం చేశారు. కృష్ణాయపాలెంలో ఎస్సీ, ఎస్టీ కేసులో అరెస్టయిన రైతులను అనిత పరామర్శించారు.

Anita consulting farmers arrested in SC and ST case in Krishnayapalem
కృష్ణాయపాలెంలో అరెస్టయిన రైతులకు పరామర్శించిన అనిత

By

Published : Dec 2, 2020, 3:24 PM IST

కృష్ణాయపాలెంలో అరెస్టయిన రైతులకు పరామర్శించిన అనిత

రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామని ప్రకటన వచ్చేంతవరకూ ఉద్యమం కొనసాగుతుందని... తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్పష్టం చేశారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా 351 రోజులుగా ఉద్యమం చేస్తున్న రైతులు, మహిళలకు వంగలపూడి అనిత సంఘీభావం ప్రకటించారు. కృష్ణాయ పాలెంలో ఎస్సీ, ఎస్టీ కేసులో అరెస్టయిన రైతులను అనిత పరామర్శించారు. అమరావతి, మందడం, వెలగపూడి, తుళ్లూరులో దీక్షలో పాల్గొన్న రైతులకు అనిత మద్దతు తెలిపారు. అమరావతి ఉద్యమంలో అసువులు బాసిన రైతుల ఆత్మకు శాంతి చేకూరాలని...రెండు నిమిషాలు మౌనం పాటించారు. మహిళలతో కలిసి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. మహిళలకు మద్దతుగా త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని అనిత చెప్పారు.

ఇదీ చదవండి:

రూ. 353 కోట్లతో పూడికమడక వద్ద ఫిషింగ్‌ హార్బర్‌!

ABOUT THE AUTHOR

...view details