గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కారుచోల పరిధిలోని మిర్చిపొలంలో పిడుగు పడి ఒక ఎద్దు మృతి చెందింది. బాజీ తన పొలాన్ని దున్నాలని లోకేశ్ అనే రైతును కోరారు. ఎద్దులతో రైతు పొలాన్ని దున్నుతుండగా ఉరుములతో కూడిన వర్షపు జల్లులు ప్రారంభమయ్యాయి.
అంతలో హఠాత్తుగా పిడుగు పడింది. దాంతో ఒక ఎద్దు అక్కడిక్కడే మరణించింది. రైతు, పొలం యజమాని స్పృహా కోల్పోయారు. వెంటనే స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఎద్దు మృతిచెందటంతో రైతు లోకేష్ రోదన.. చూపరులను కంటతడి పెట్టించింది.