ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించే డిగ్రీలోపు ప్రవేశాల కౌన్సిలింగ్ ఇకపై ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించబోతుంది. ఈ మేరకు ఏపీ ఉన్నత విద్యామండలితో వర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. కొవిడ్ పరిస్థితులు, విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో హాజరవ్వటం వల్ల ఎదురయ్యే ఇబ్బందులు ఈ విధానంతో తగ్గనున్నాయి.
గుంటూరు సమీపంలోని లామ్ ఫామ్లో జరిగిన కార్యక్రమంలో ఏపీ ఉన్నతమండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి.., విశ్వవిద్యాలయ ఉపకులపతి విష్ణువర్ధన్ రెడ్డి ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. 2020-21 ఏడాది కాలానికి జరిగే ఆన్లైన్ కౌన్సిలింగ్లో వ్యవసాయంతో పాటు ఉద్యాన, పశు వైద్య వర్సటీల విద్యార్థులకు ఉపశమనం కలగనుందని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ తెలిపారు.