'పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించండి' - గుంటూరులో అంగన్వాడీల ధర్నా
పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని అంగన్‌వాడీలు ధర్నా చేపట్టారు. అంగన్‌వాడీ కేంద్రాలకు యజమానులు తాళాలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జోరు వానలోనూ ధర్నా కొనసాగించారు.

anganwadi
పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించండి
పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ అంగన్ వాడీలు ..గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. జోరు వానలో సైతం తమ ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లుగా అంగన్‌వాడీ కేంద్రాల అద్దెలు, ఫ్రీ స్కూల్ బిల్లులను ప్రభుత్వం చెల్లించటంలేదని ఆరోపించారు. యజమానులు కేంద్రాలకు తాళాలు వేస్తున్నారంటూ .. అంగన్‌వాడీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేమేశ్వరి తెలిపారు. బిల్లులు సకాలంలో అందని కారణంగానే విధులు సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నామని చెప్పారు.