గ్రామస్థులు దాడి చేశారని అంగన్వాడీ టీచర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన ఘటన గుంటూరు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్లలో జరిగింది. గ్రామానికి చెందిన మంగమ్మ అంగన్వాడీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ.. కిరాణా దుకాణం నడుపుతోంది. ఆ దుకాణంలో సరకులు అధిక ధరలకు అమ్ముతున్నారంటూ స్థానికులు ఆరోపించారు.
ఈ విషయమై మంగమ్మకు, గ్రామస్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అధికారులకు ఫిర్యాదు చేసేందుకు గ్రామస్థులు సంతకాల సేకరణ చేపట్టారు. ఆగ్రహించిన మంగమ్మ కుటుంబసభ్యులు వారితో గొడవకు దిగారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మంగమ్మను తోసివేశారు. ఈ ఘటనపై ఆమె కారంపూడి స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు విచారణ చేపట్టారు.