అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి.వేమేశ్వరి డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె... గుంటూరు జిల్లాలో అర్హులుగా ఉన్న అంగన్వాడీ హెల్పర్లను గుర్తించి వారిని వర్కర్లుగా పదోన్నతి కల్పించాలన్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న హెల్పర్లకు పదోన్నతి కల్పించకపోవడం దారుణమన్నారు.
'అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలి' - బ్రాడీపేటలో అంగన్వాడీలు
అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి.వేమేశ్వరి డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి పని చేస్తున్న హెల్పర్లకు పదోన్నతి కల్పించకపోవడం దారుణమన్నారు
బ్రాడీపేటలో అంగన్వాడీలు
అంగన్వాడీలు పోరాడి సాధించుకున్న 102 జీవోని తక్షణమే అమలు చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసి అందులో మౌలిక సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ నెల 20న సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆమె హెచ్చరించారు.
ఇదీ చూడండి.నా ప్రమేయం ఉంటే ఉరి తీయండి: ఆది నారాయణరెడ్డి