ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వ్యాక్సిన్ వికటించటం వల్లే అంగన్​వాడీ కార్యకర్త మృతి' - కరోనా వ్యాక్సిన్ వికటించి అంగన్​వాడీ కార్యకర్త మృతి

కరోనా వ్యాక్సిన్ వికటించి అంగన్​వాడీ కార్యకర్త మృతి చెందిందని ఆరోపిస్తూ..గుంటూరు జీజీహెచ్ ఎదుట ఏపీ అంగన్​వాడీ కార్యకర్తల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

వ్యాక్సిన్ వికటించటం వల్లే అంగన్​వాడీ కార్యకర్త మృతి
వ్యాక్సిన్ వికటించటం వల్లే అంగన్​వాడీ కార్యకర్త మృతి

By

Published : Mar 20, 2021, 9:46 PM IST

కరోనా వ్యాక్సిన్ వికటించి అంగన్​వాడీ కార్యకర్త మృతి చెందిందని ఆరోపిస్తూ..గుంటూరు జీజీహెచ్ ఎదుట ఏపీ అంగన్​వాడీ కార్యకర్తల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. చండూరుకు చెందిన అంగన్​వాడీ కార్యకర్త నిర్మలాదేవి అస్వస్థతకు గురికాగా.. కుటుంబ సభ్యులు ఈనెల 11న ఆమెను జీజీహెచ్​లో చేర్పించారు. కాగా..చికిత్స పొందుతూ గత రాత్రి మృతి చెందింది.

ఈనెల 6న నిర్మలాదేవికి కరోనా రెండో డోసు టీకా తీసుకుంది. వ్యాక్సిన్ తీసుకోవటం వల్లే నిర్మలా అస్వస్థతకు గురైందని అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావమ్మ ఆరోపిస్తున్నారు. మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని...రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల పరిహారంతో పాటు ఇంట్లో ఒకరికి ఉద్యోగం, ఇంటి స్థలం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details