ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆంధ్రాబ్యాంక్​లో గోల్​మాల్​: కేజీ గోల్డ్ మాయం - andhrabank officer cheating godl

బ్యాంక్​లో తాకట్టుపెట్టుకొని నగదు ఇవ్వమంటే... కేజీ బంగారంతో ఉడాయించాడో వ్యక్తి. బంగారం తీసుకెళ్లి మరో దగ్గర తనఖా పెట్టాడు. సదరు వ్యక్తి 15 ఏళ్లుగా బ్యాంక్​లో ఒప్పంద పద్ధతి​ కింద విధులు నిర్వర్తిస్తున్నాడు.

తాకట్టుపెట్టమంటే.. కేజీ బంగారం తన్నుకుపోయాడు
తాకట్టుపెట్టమంటే.. కేజీ బంగారం తన్నుకుపోయాడు

By

Published : Feb 13, 2020, 2:55 PM IST

ప్రత్తిపాడు ఆంధ్రాబ్యాంక్​లో గోల్​మాల్​: గోల్డ్ మాయం

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని ఆంధ్రా బ్యాంక్​లో కేజీ బంగారానికి పైగా గోల్​మాల్ జరిగింది. ఆంధ్రా బ్యాంక్​లో ఆభరణాలు తాకట్టు పెట్టుకునే విభాగంలో నాగూర్​వలి 15 ఏళ్లుగా ఒప్పంద పద్ధతిలో​ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈనెల 11న కొంతమంది ఖాతాదారులు బంగారం తాకట్టు పెట్టి... నగదు తీసుకునేందుకు వెళ్లారు. వారివద్ద బంగారం తీసుకున్న నాగూర్​వలి నగదు చెల్లించలేదు. ఖాతాదారుల బంగారాన్ని మణప్పురం సంస్థలో కుదువ పెట్టి నగదు తీసుకున్నట్లు ఆంధ్రాబ్యాంక్​ అధికారులు నిర్ధారించారు. మోసపోయామని తెలుసుకున్న ఖాతాదారులు బ్యాంక్​ వద్దకు చేరుకొని లబోదిబోమన్నారు. ఈ వ్యవహారంపై బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details