ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పదోన్నతుల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలి: మున్సిపల్ టీచర్లు - మున్సిపల్ టీచర్ల న్యాయమైన డిమాండ్ల

పురపాలక పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు రాష్ట్రవాప్తంగా నిరసనకు దిగారు. పదోన్నతుల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఐచ్ఛిక బదిలీలు నిర్వహించాలని కోరారు.

Andhra Pradesh Municipal Teachers
పురపాలక పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు

By

Published : Nov 21, 2020, 8:51 PM IST

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఉపాధ్యాయుల సమాఖ్య పిలుపు మేరకు రాష్ట్రవాప్తంగా మున్సిపల్ టీచర్లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పదోన్నతుల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని సమాఖ్య అధ్యక్షులు రామకృష్ణ డిమాండ్ చేశారు. గుంటూరులోని ఆర్ఆర్​ పురపాలక పాఠశాలలో జరిగిన నిరసనలో ఆయన పాల్గొన్నారు.

మున్సిపాలిటీని యూనిట్​గా తీసుకుని, అక్కడ పనిచేసే ఉపాధ్యాయులకు ఐచ్ఛిక బదిలీలు నిర్వహించాలన్నారు. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఉండేలా హేతుబద్ధీకరణ జరగాలని వివరించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details