ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ చర్చికి వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న లాజరస్ అబ్రహం అనే వ్యక్తిని బ్రదర్ అనిల్ తీసుకువచ్చి ట్రెజరర్‌గా నియమించడం సరికాదంటూ.. ఆ సంస్థ పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్రదర్ అనిల్‌కి సంబంధం లేని సంస్థల్లో ఆయన ప్రవేశించారంటూ చర్చి పెద్దలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
"బ్రదర్ అనిల్ నిర్ణయాలపై.. ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం" - ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ చర్చి
ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ చర్చి పెద్దలు బ్రదర్ అనిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిని బ్రదర్ అనిల్ తీసుకువచ్చి ట్రెజరర్‌గా నియమించడం సరికాదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్రదర్ అనిల్ నిర్ణయాలపై ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు.

Andhra Evangelical Lutheran Church
గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్‌లోని ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ చర్చి మత పెద్దలు సమావేశమై చర్చించారు. బ్రదర్ అనిల్ నిర్ణయాలపై ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నూతన పాలక వర్గాన్ని ఏర్పాటు చేసి.. సంస్థను గాడినపెట్టే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు సంస్థ పెద్దలు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:ఈనెల 31 లోగా సీఎం జగన్‌కు సమన్లు అందించండి: నాంపల్లి కోర్టు