ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చర్చిలో రెండు గ్రూపులు.. పోలీస్ స్టేషన్​కు చేరిన పంచాయితీ! - high court

గుంటూరులోని ఆంధ్రా-ఇవాంజిలికల్ లూథరన్ చర్చ్ లో రెండు గ్రూపుల మధ్య పంచాయితీ రచ్చకెక్కింది. ఆ తర్వాత కోర్టు, పోలీస్ స్టేషన్ మెట్లూ ఎక్కింది! ఇప్పుడు రోడ్డెక్కిధర్నాలు చేసేవరకూ వెళ్లింది. మరి, ఇంతకీ ఆ సమస్యేంటి? ఆ వివాదం ఏంటీ??

చర్చిలో రెండు గ్రూపులు.. పోలీస్ స్టేషన్​కు చేరిన పంచాయితీ!
చర్చిలో రెండు గ్రూపులు.. పోలీస్ స్టేషన్​కు చేరిన పంచాయితీ!

By

Published : Mar 21, 2022, 6:57 PM IST

గుంటూరులోని ఆంధ్రా-ఇవాంజిలికల్ లూథరన్ చర్చ్ సంస్థ గత ఏడాది మేలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. అయితే.. నూతన కార్యవర్గాన్ని కార్యాలయంలోకి రాకుండా కొందరు వ్యక్తులు అడ్డుకుంటున్నారని.. రౌడీల చేత దాడులకు పాల్పడుతున్నారని నూతన కార్యవర్గ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించగా నూతన కార్యవర్గం కార్యాలయంలోకి వెళ్లవచ్చని ఈనెల 16న స్పష్టమైన తీర్పు ఇచ్చిందని, అయినా.. తమని కార్యాలయంలోకి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని, వారు గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

తమకు న్యాయం చేయాలని కోర్టు తీర్పు ప్రకారం కార్యాలయంలోకి అనుమతించేలా చూడాలని కోరారు. అనంతరం లాడ్జి సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. బ్రదర్ అనిల్​తోపాటు హోంమంత్రి సుచరిత తమను అడ్డుకుంటున్నవారికి మద్దతిస్తున్నారని ఆరోపించారు. తమని అనుమతించేంత వరకూ ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details