లాక్డౌన్ వల్ల ఆహారం దొరకక ఇబ్బంది పడుతున్న గుంటూరు జిల్లాలోని 14 మండలాల్లోని సుమారు 17వేల మంది వలస, వ్యవసాయ కార్మికులకు సహాయం చేసేందుకు ఆంధ్రా కనెక్ట్ ముందుకొచ్చింది. రెడ్డీస్ ల్యాబ్, ఇన్ఫోసిస్ సహకారంతో ఒక్కొక్కరికి సుమారు 700 రూపాయల విలువైన బియ్యం, పచారీ సరుకులు అందించేందుకు చర్యలు ప్రారంభించింది. గుంటూరు జిల్లా మంగళగిరి అక్షయపాత్ర ఆధ్వర్యంలో వీటిని పంపిణీ చేయనున్నారు. ఈ సరుకులను మంగళగిరి అక్షయపాత్ర వంటశాలలో ప్యాకింగ్ చేస్తున్నారు. హోంమంత్రి మేకతోటి సుచరిత చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించనున్నారు.
వేలాది వలస కార్మికులకు ఆంధ్రా కనెక్ట్ సాయం - ఆంధ్రా కనెక్ట్ వార్తలు
లాక్డౌన్ నేపథ్యంలో ఆహారం దొరకక ఇబ్బందులు పడుతున్న17వేల మంది వలస, వ్యవసాయ కార్మికుల పొట్ట నింపేందుకు ఆంధ్రా కనెక్ట్ సిద్ధమైంది. వివిధ సంస్థల సాయంలో వారికి నిత్యావసరాలు పంపిణీ చేసేందుకు అన్ని చర్యలు చేపట్టింది. ఈ నెల 7న బాధిత కుటుంబాలకు వీటిని పంపిణీ చేయనున్నారు.
andhra connect news
10వేల కుటుంబాలకు రెడ్డీస్ ల్యాబ్, 7వేల కుటుంబాలకు ఇన్ఫోసిస్ అందిస్తోందని ఏపీ కనెక్ట్ సీఈవో కోటేశ్వరమ్మ చెప్పారు. 14మండలాల్లోని తహసీల్దార్లకు ఈనెల 7న అందజేస్తామని వారే ఆయా గ్రామాల్లోని కార్మికులకు పంపిణీ చేస్తారని తెలిపారు. ఇంకా వలస, వ్యవసాయ కార్మికులకు ఆహారం కావాలన్నా సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో 226కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు