Anandaiah comments on AP govt: కరోనా మందును దేశవ్యాప్తంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆనందయ్య తెలిపారు. కరోనాలో ఎన్ని వేరియంట్లు వచ్చిన మందులు తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. మందు తయారికీ ప్రభుత్వం సహకరించడంలేదన్న ఆయన... అడ్డంకులు సృష్టిస్తుందని ఆరోపించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో బీసీ ఐకాస ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆనందయ్య, ఎమ్మెల్సీ పోతుల సునీత, మురుగుడు హనుమంతరావు, జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు.
కరోనా మందును దేశవ్యాప్తంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నా. కరోనాలో ఎన్ని వేరియంట్లు వచ్చిన మందులు తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. కానీ ప్రభుత్వం సహకరించడంలేదు. అయినా నా ప్రయత్నాలు ఆగవు. ఈ రాష్ట్రంలో కాకుంటే మరో రాష్ట్రంలో కరోనా మందు తయారు చేస్తాను. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం సహకరిస్తుంది. ఏ వ్యాధికైనా మందు తయారు చేస్తాను.- ఆనందయ్య, కరోనా మందు తయారీదారి