హిందూ ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. దేవాలయాలపై దాడులు, అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైకాపా పాలనలో రాజకీయాలకు వేదికగా దేవాలయాలు మారాయని ఆరోపించారు.
దేవాలయాల మీద దాడులపై సీబీఐ విచారణ జరపాలి - దేవాలయాలపై దాడులపై అనగాని
దేవాలయాలపై దాడులు, అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కోరారు. ప్రార్థనా మందిరాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సత్యప్రసాద్ అన్నారు.
అనగాని సత్యప్రసాద్
ఆలయాల కూల్చివేతలు, విగ్రహాల ధ్వంసం జరుగుతున్నా చర్యల్లేవని తప్పుబట్టారు. సీఎం జగన్ చర్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయన్న అనగాని..,ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా ప్రభుత్వం నడుచుకోవాలని హితవుపలికారు. ప్రార్థనా మందిరాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెల్చిచెప్పారు.
ఇదీ చదవండి: రూ.12 కోట్లకు టోకరా వేసిన నూతన్ నాయుడు?