ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

28 మంది ఎంపీలున్నా.. ప్రత్యేక హోదాపై పోరాటం శూన్యం: అనగాని - వైకాపా ప్రభుత్వంపై అనగాని కామెంట్స్

వైకాపా అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తున్నా.. ఇప్పటివరకు రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. 28 మంది ఎంపీలున్నా రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై పోరాడకపోవటం సిగ్గు చేటన్నారు.

28 మంది ఎంపీలున్నా ప్రత్యేక హోదాపై పోరాటం శూన్యం
28 మంది ఎంపీలున్నా ప్రత్యేక హోదాపై పోరాటం శూన్యం

By

Published : Feb 23, 2021, 9:26 PM IST

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వైకాపా ప్రభుత్వం గాలికొదిలేసిందని గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. పట్టణ తెదేపా కార్యాలయంలో నిర్వహించిన ఎర్రన్నాయుడు జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తున్నా.. ఇప్పటివరకు రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని అనగాని ఆక్షేపించారు.

మున్సిపల్ ఎన్నికల్లో వైకాపాకు ఓట్లడిగే అర్హత లేదని దుయ్యబట్టారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోగా..ప్రభుత్వ ఆస్తులను తక్కువ ధరలకు అమ్మే కుట్రలు చేస్తోందని ఆరోపించారు. 28 మంది ఎంపీలున్నా రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై పోరాడకపోవటం సిగ్గుచేటన్నారు.

ABOUT THE AUTHOR

...view details