ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నకరికల్లులో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి - గుంటూరు జిల్లా రోడ్డు ప్రమాదాలు

గుంటూరు జిల్లా నకరికల్లులో ద్విచక్ర వాహనాన్ని.. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

road accident
నకరికల్లులో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

By

Published : Jan 29, 2021, 12:37 PM IST

Updated : Jan 29, 2021, 1:22 PM IST

ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొనటంతో.. ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. నకరికల్లు మండలం తురకపాలెంకు చెందిన తెదేపా కార్యకర్తలు దౌపాటి రాజా, నాగోతు ఇన్నయ్యలు.. నకరికల్లులో జరుగుతున్న తమ పార్టి సమావేశానికి ద్విచక్ర వాహనంపై వెళ్లారు. కార్యక్రమం అనంతరం తిరిగి వస్తుండగా.. నకరికల్లు అడ్డరోడ్డు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో దౌపాటి రాజా అక్కడికక్కడే మృతి చెందగా.. నాగోతు ఇన్నయ్య నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడని నకరికల్లు ఎస్సై ఉదయబాబు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ ప్రమాదంపై తెదేపా నేతలు చంద్రబాబు, అచ్చెన్నాయుడు, నారా లోకేశ్​ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. వారికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రహదారి ప్రయాణాల్లో కార్యకర్తలంతా జాగ్రత్తగా ఉంటూ.. సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని పేర్కొన్నారు.

ఇదీ చదవండీ..అరుదైన వైద్యం చేశారు.. ప్రాణం పోశారు

Last Updated : Jan 29, 2021, 1:22 PM IST

ABOUT THE AUTHOR

...view details