గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో వైకాపా ఎమ్మెల్యే విడదల రజని వర్గీయుల కారుపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కోటప్పకొండలో జరుగుతున్న తిరునాళ్లను వీక్షించేందుకు వచ్చిన రజని వర్గీయుల కారును ఈటీ గ్రామం వద్ద ధ్వంసం చేశారు. ఘటనపై ఎమ్మెల్యే బంధువు గోపి పోలీసులకు ఫిర్యాదు చేయగా..విచారణ చేపట్టారు. బుధవారం అర్థరాత్రి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కారును రజని వర్గీయులు అడ్డుకున్న సంగతి విధితమే.
ఎమ్మెల్యే వర్గీయుల కారుపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి - గుంటూరులో కారుపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి
వైకాపా ఎమ్మెల్యే విడదల రజని వర్గీయులకు చెందిన కారుపై చిలకలూరిపేటలో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఘటనలో కారు ధ్వంసం కాగా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యే వర్గీయుల కారుపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి