కరోనా నివారణ కోసం టీకా వేయించుకున్న కొన్ని గంటల వ్యవధిలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా మాచర్లలో జరిగింది. పట్టణంలోని ఆజాద్నగర్కు చెందిన షేక్ సైదా(70) బుధవారం కొవిడ్ వాక్సిన్ వేయించుకున్నారు. ఆ రోజు రాత్రి గుండె నొప్పి కారణంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది... జిల్లా అధికారులకు సమాచారం అందించారు. మృతి చెందిన వ్యక్తికి బీపీ, పెరాలసిస్ వంటి అనారోగ్య సమస్యలున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వైద్యురాలు శివలీలా తెలిపారు. దీనిపై జిల్లా అధికారులు ప్రత్యేక విచారణ చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
వృద్ధుడు మృతి.. కొవిడ్ టీకానా? అనారోగ్య సమస్యలా? - death news in macherla news
కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నాక.. ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా మాచర్లలో జరిగింది.
![వృద్ధుడు మృతి.. కొవిడ్ టీకానా? అనారోగ్య సమస్యలా? covid](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11420451-249-11420451-1618547521251.jpg)
కొవిడ్