ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సెల్ఫీ దిగుతూ చెరువులో పడి విద్యార్థి మృతి - చిలకలూరి పేటలో విషాదం

చరవాణి ద్వారా సెల్ఫీ దిగుతూ కాలుజారి చెరువులో పడి విద్యార్థి మృతి చెందిన సంఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జరిగింది.

చిలకలూరి పేటలో విషాదం... సెల్ఫీ దిగుతూ చెరువులో పడి విద్యార్థి మృతి

By

Published : Nov 21, 2019, 5:44 AM IST

విషాదం... సెల్ఫీ దిగుతూ చెరువులో పడి విద్యార్థి మృతి

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో విషాదం నెలకొంది. సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. పట్టణంలోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సిద్ధా బత్తుని హనూక్... అతని స్నేహితులతో అమ్మఒడి పథకానికి రేషన్ కార్డులు తీసుకొస్తామని కళాశాలలో చెప్పి ఇంటికొచ్చారు. అనంతరం కళాశాలకు వెళ్లకుండా చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ చరవాణిలో సెల్ఫీ దిగుతూ హనూక్ కాలు జారి నీటిలో పడిపోయాడు. స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. చిలకూరిపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details