ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Couple death: మరణంలోనూ వీడని బంధం... భర్త పడిపోగానే..! - గుంటూరు జిల్లా తాజా వార్తలు

Couple death: గుంటూరు జిల్లాలో వృద్ధ దంపతులు మృతి చెందారు. భర్త ఒక్కసారిగా కింద పడిపోవడాన్ని చూసిన భార్య స్పృహకోల్పోయింది. వీరిద్దరిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే వారు మరణించారని వైద్యులు నిర్ధారించారు.

couple died Couple death
దంపతులు మృతి

By

Published : Oct 29, 2022, 6:18 PM IST

Updated : Oct 30, 2022, 5:15 PM IST

Couple death: మరణంలోనూ వారి బంధం వీడలేదు. యాభై ఏళ్ల వివాహ బంధం మరణంలోనూ వీడకుండా జంటగానే తనువులు చాలించారు ఆ వృద్ధ దంపతులు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళుతూ భర్త కింద పడ్డాడు. అది చూసి అతని భార్య స్పృహ తప్పింది. కాసేపటికే ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా తాడికొండ మండలం బడేపురం గ్రామంలో చోటు చేసుకుంది.

బడేపురం గ్రామానికి చెందిన కూరగాయల వ్యాపారి జపణయ్య (70) శుక్రవారం రాత్రి కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళుతున్న సమయంలో ఒక్కసరిగా కిందపడ్డాడు. అది చూసిన అతడి భార్య స్పృహ కోల్పోయింది. చికిత్స నిమిత్తం దంపతులను స్థానికులు.. 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే జపణయ్య, కుమారమ్మ ఇద్దరు మృతి చెందారని వైద్యులు తెలిపారు. దంపతుల మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇవీ చదవండి:

Last Updated : Oct 30, 2022, 5:15 PM IST

ABOUT THE AUTHOR

...view details