ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 23, 2020, 6:14 AM IST

ETV Bharat / state

తాటిచెట్టు కాదు... తాళపత్ర వృక్షం!

బ్రహ్మంగారి కాలజ్ఞానం సహా పూర్వ గ్రంథాలన్నీ తాళపత్రాల్లోనే నిక్షిప్తమయ్యాయి. వాటి గురించి విన్న ప్రతిసారీ వందల ఏళ్లు చెక్కుచెదరకుండా ఉండే పత్రాలను ఏ చెట్ల నుంచి సేకరించారనే సందేహం కలుగుతుంది. దానికి సమాధానం గుంటూరు జిల్లాలో దొరికింది.

Sreethalam tree
Sreethalam tree

తాటిచెట్టు కాదు... తాళపత్ర వృక్షం!

పూర్వీకులు తమ రచనలను తాళపత్ర గ్రంథాల్లో నిక్షిప్తం చేసేవారు. వాటి కోసం శ్రీతాళం సహా కొన్ని ప్రత్యేకమైన చెట్ల నుంచి ఆకులు సేకరించేవారు. వాటిని ఎండబెట్టి, క్రమపద్ధతిలో గుదిగుచ్చి తాళపత్రాలు సిద్ధం చేసేవారు. వాటిపైన ఘటంతో రాసేవారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోతో పాటు శ్రీలంకలో ఎక్కువగా ఉండే ఈ చెట్లు... ఇటీవలి కాలంలో అంతరించిపోయాయి. అయితే గుంటూరు జిల్లా నారాకోడూరులో ఇటీవల ఈ చెట్టును గుర్తించారు.

తాటి చెట్టు అనుకున్నారు

నారాకోడూరు గ్రామస్తులు ఇన్నాళ్లూ దీన్నో తాటిచెట్టుగానే చూశారు. ఇటీవల చెట్టు శిఖర భాగంలో పూలగుత్తులు రావటం, కొద్ది రోజుల్లోనే పొడవుగా పెరిగి అందంగా కనిపించటంతో చర్చ మొదలైంది. ఆ తర్వాత ఆకులన్నీ ఎండిపోయి చెట్టు మొత్తం వాడిపోయింది. పూలగుత్తులు మాత్రమే లేత పసుపు రంగులో ఉన్నాయి. ఈ మార్పులు చూసి గ్రామస్తులు విస్తుపోయారు. ఆ తర్వాత కాయలు కాసి నేలరాలాయి. స్థానిక వ్యవసాయ శాస్త్రవేత్తల్ని ఆరా తీస్తే జన్యుమార్పులని చెప్పారు. ఐతే తమిళనాడులోని అన్నామలై యూనివర్శిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ ఇటీవల దీన్ని చూసి శ్రీతాళం చెట్టుగా గుర్తించారు. దీన్ని సిద్ధ వైద్యంలోనూ ఉపయోగించేవారని వృక్షశాస్త్ర నిపుణులు తెలిపారు.

కొద్ది రోజులే జీవం

ఏళ్లుగా ఈ చెట్టును చూస్తున్నామని... ఇది అవశానదశకు వచ్చేంతవరకూ అరుదైన శ్రీతాళం చెట్టుగా గుర్తించలేకపోయామని స్థానికులు తెలిపారు. అరుదుగా కనిపించిన ఈ చెట్టు మరికొద్ది రోజుల్లోనే పూర్తిగా జీవం కోల్పోతుందని వృక్షశాస్త్ర నిపుణులు తెలిపారు.

ఇదీ చదవండి

జనం లేకుండా జగన్నాథుడు.. చరిత్రలో ఇదే ప్రథమం

ABOUT THE AUTHOR

...view details