Amaravati Farmers Fires On CM Jagan : అమరావతి ఉద్యమంపై ముఖ్యమంత్రి జగన్ తప్పుడు ప్రచారం చేస్తే ఆయనను గద్దె దించేవరకు తాము పోరాటం చేస్తామని రాజధాని రైతులు తేల్చి చెప్పారు. దిల్లీలో వ్యాపారవేత్తలతో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అభివృద్ధిపై కాకుండా.. విశాఖ రాజధాని గురించి మాట్లాడటం ఏంటని రైతులు ప్రశ్నించారు. రాష్ట్రంలోని 26 జిల్లాలు అభివృద్ధి గురించి మాట్లాడితే.. తామంత సంతోషించే వాళ్లమని.. అలా కాకుండా న్యాయస్థాన పరిధిలో ఉన్న రాజధాని అంశంపై ముఖ్యమంత్రికి అక్కడ మాట్లాడాల్సిన అవసరమేంటని రైతులు నిలదీశారు. ముఖ్యమంత్రి ముమ్మాటికి న్యాయస్థానాన్ని ధిక్కరించి వ్యవహరించారని రైతుల ఆరోపించారు. అమరావతికి వ్యతిరేకంగా పని చేస్తున్న మీడియా సంస్థలపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
"దిల్లీలో రాష్ట్ర అభివృద్ధిపై కాకుండా విశాఖ రాజధాని గురించి మాట్లాడటమేంటి..?" - సీఎం జగన్ ప్రకటనను ఖండించిన అమరావతి జేఏసీ నేతలు
Amaravati Farmers Fires On CM Jagan : సీఎం జగన్ చేసిన విశాఖ రాజధాని ప్రకటనను అమరావతి ఐకాస నేతలు తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి జగన్‌ను గద్దె దింపేదుకు ఐకాస పని చేస్తుందని నేతలు స్పష్టం చేశారు.
Amaravati Farmers Fires On CM Jagan