ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సందేహం లేదు... రాజధాని అమరావతిలోనే ఉంటుంది' - అమరావతి రాజధాని తాజా వార్తలు

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తే రాజధానిని అమరావతిలోనే నిర్మిస్తామన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. వైకాపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై జనసేనతో కలిసి పోరాడతామని చెప్పారు.

somu veerraju
somu veerraju

By

Published : Sep 21, 2020, 7:06 PM IST

రాజధాని అమరావతిలోనే ఉంటుందని ఇందులో ఎలాంటి సందేహాలు లేవని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తమకు ప్రజలు అధికారం ఇస్తే రాజధానిని అమరావతిలోనే నిర్మిస్తామని చెప్పారు. సోమవారం గుంటూరు జిల్లాలోని మంగళగిరికి వచ్చిన ఆయన... పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత రాజధాని రైతులు, జనసేన నాయకులు సోము వీర్రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

వైకాపా ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక చర్యలపై రాబోయే రోజుల్లో జనసేనతో కలిసి పోరాడతాం. రాష్ట్రంలో కుటుంబ పరిపాలన సాగుతోంది. ఏపీ నిజమైన అభివృద్ధి సాధించాలంటే భాజపా అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుని భారీగా పెట్టుబడులు తీసుకురావాలి. ప్రభుత్వం చేపడుతున్న నాడు-నేడు, రైతు భరోసా కేంద్రాలకు సైతం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఎన్​ఆర్​ఈజీఎస్ ద్వారా ఇప్పటికే వీటి కోసం నిధులు కేటాయించారు- సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ABOUT THE AUTHOR

...view details