Amravati Inner Ring Road Case Hearing Adjourned :నిర్మాణమే జరగని రింగ్ రోడ్డు విషయంలో కుట్ర కోణం ఉందని సీఐడీ చేస్తున్న వాదన ఆశ్చర్యానికి గురి చేస్తోందని చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం ఒక్క ఎకరా కూడా సేకరించలేదన్నారు. భూ సేకరణ జరిగినట్లు ఒక్క కాగితమైనా సీఐడీ ఆధారంగా చూపగలదా? అని ప్రశ్నించారు. రాజధాని అమరావతి నిర్మాణాన్నేరాష్ట్ర ప్రభుత్వం నిలిపేసిందని,రింగ్ రోడ్డు ప్రస్తావన ఇంకెక్కడుందని వ్యాఖ్యానించారు. పూర్తి స్థాయి వాదనలు వినిపించేందుకు సమయం లేకపోవడంతో విచారణ సోమవారానికి వాయిదా పడింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
AP High Court Hearing Chandrababu Anticipatory Bail Petition :ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరపింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ దురుద్దేశంతో కేసులు నమోదు చేశారని చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. పిటిషనర్ దృష్టి మళ్లించేందుకు యత్నిస్తున్నారన్నారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు - చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
CBN IRR Case : రింగ్ రోడ్డు ఇప్పటికీ ఉనికిలో ఉందని భావించేటట్లయితే 2014 నుంచి బాధ్యులైన అధికారులను ప్రాసిక్యూట్ చేయాల్సి వస్తుందన్నారు. కొందరు అధికారులు రెండు పడవలపై ప్రమాణం చేస్తున్నారన్నారు. వారు నీటిలో మునగడం ఖాయమన్నారు. అమరావతి బృహత్తర ప్రణాళిక రూపకల్పన విషయంలో సింగపూర్, ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందం ఉందన్న ఆయన నామినేటెడ్ పద్ధతిలో సుర్బానా జురాంగ్ సంస్థకు పనులు అప్పగించారన్న సీఐడీ ఆరోపణలో వాస్తవం లేదన్నారు. లింగమనేని సంస్థ యాజమాన్యానికి కంతేరు, నంబూరు గ్రామాల పరిధిలో పూర్వికుల నుంచి వారసత్వంగా వచ్చిన భూములున్నాయన్నారు.