వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు అమరావతి అన్నదాతలు హస్తినకు బయలుదేరారు. రాజధాని గ్రామాల నుంచి 25 మంది రైతులు వారం రోజులపాటు దిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమంలో పాల్గొంటారు. అమరావతిలో రైతులు చేస్తున్న ఉద్యమాన్ని అక్కడి అన్నదాతలకు వివరించనున్నారు.
దిల్లీ బయల్దేరిన అమరావతి రైతులు - అమరావతి రైతుల దీక్ష
దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు అమరావతి రైతులు హస్తినకు బయలుదేరారు. 413 రోజులుగా అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమాన్ని అక్కడి రైతులకు వివరించనున్నారు.
దిల్లీ బయల్దేరిన అమరావతి రైతులు
రాష్ట్ర రాజధాని కోసం తమ ప్రాణ సమానమైన భూములను ప్రజా రాజధాని కోసం అప్పటి తెదేపా ప్రభుత్వానికి ఇచ్చామని..ఇప్పుడున్న వైకాపా సర్కారు మూడు రాజధానుల ప్రకటనతో తమను మోసగించిన వైనాన్ని దిల్లీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగాలని 413రోజులుగా చేస్తున్న ఉద్యమ తీరును అక్కడి రైతులకు వివరించనున్నారు.
ఇదీ చదవండి