పరిపాలన రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు, మహిళలు విజయవాడ కనకదుర్గ అమ్మవారికి పొంగలి సమర్పించనున్నారు. ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం గ్రామాలకు చెందిన 15 మంది రైతులు, మహిళలు కాలినడకన సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా విజయవాడ దుర్గ ఆలయానికి బయల్దేరారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించేలా ముఖ్యమంత్రి మనసు మారాలని కనకదుర్గమ్మకు పొంగళ్లు సమర్పించనున్నట్లు రైతులు తెలిపారు.
కనకదుర్గమ్మకు పొంగళ్లు సమర్పించనున్న అమరావతి రైతులు - అమరావతిపై వార్తలు
ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రాజధాని రైతులు, మహిళలు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి బయల్దేరారు. ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం గ్రామాలకు చెందిన 15 మంది రైతులు, మహిళలు కాలినడకన గుడికి చేరుకోనున్నారు. కాసేపట్లో అమ్మవారికి మహిళలు పొంగళ్లు సమర్పిస్తారు.
![కనకదుర్గమ్మకు పొంగళ్లు సమర్పించనున్న అమరావతి రైతులు Amravati farmers to present pongals to Kanakadurgam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9106600-266-9106600-1602213197930.jpg)
కనకదుర్గమ్మకు పొంగళ్లు సమర్పించనున్న అమరావతి రైతులు
కనకదుర్గమ్మకు పొంగళ్లు సమర్పించనున్న అమరావతి రైతులు
ఇదీ చదవండి: వెండి సింహాల కేసు మిస్టరీ వీడేదెన్నడో?