ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం వ్యాఖ్యలపై భగ్గుమన్న అమరావతి రైతులు - against cms comments on capital

రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వ తీరుతో అమరావతి రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నో అంచనాలతో భూములు అప్పగిస్తే... అందుకు భిన్నంగా వ్యవహరించడమేంటని ప్రశ్నిస్తున్నారు. సీఎం ప్రకటనకు నిరసనగా వెలగపూడి, రాయపూడి, కిష్టాయపాలెం, మందడంలో రైతుల ధర్నా చేశారు. మందడంలో రోడ్డుపై బైఠాయించారు. రైతులను అదుపు చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు. మూడు రాజధానుల ప్రకటన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని నినాదాలు చేస్తున్నారు.

రాజధానిపై సీఎం వ్యాఖ్యలకు నిరసనగా... అమరావతి రైతులు ఆందోళన
రాజధానిపై సీఎం వ్యాఖ్యలకు నిరసనగా... అమరావతి రైతులు ఆందోళన

By

Published : Dec 18, 2019, 11:25 AM IST

Updated : Dec 18, 2019, 12:31 PM IST

రాజధానిపై సీఎం వ్యాఖ్యలకు నిరసనగా... అమరావతి రైతులు ఆందోళన

రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో రైతులు ఆందోళన చేస్తున్నారు. వీరిని అదుపు చేయటానికి పోలీసులు భారీగా మోహరించారు. సచివాలయం, హైకోర్టుకు వెళ్లే వాహనాలను పోలీసు సిబ్బంది మళ్లిస్తున్నారు.

పురుగు మందుల డబ్బాలతో నిరసన
తుళ్లూరులో రాజధాని ప్రాంత రైతుల రహదారి దిగ్బంధం చేసి ఆందోళన చేస్తున్నారు. పురుగుల మందు డబ్బాలతో నిరసన చేస్తున్నారు. విజయవాడ-అమరావతి మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమస్య పరిష్కారమయ్యేవరకు రహదారులు దిగ్బంధం చేస్తామని రైతులు వాపోతున్నారు.మూడు రాజధానుల ప్రకటన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించి నిర్మాణాలు చేపట్టాలని ఆందోళన చేస్తున్నారు.

రాయపూడిలో రైతుల ఆందోళన
యపూడిలో రైతుల ఆందోళనలు చేస్తున్నారు. 3రాజధానుల ప్రకటనను సీఎం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని నిరసన చేస్తున్నారు.

మందడంలో కలకలం...
మందడంలో రైతుల ఆందోళన వద్ద కలకలం చెలరేగింది. జై విశాఖ అంటూ పోస్టర్ ప్రదర్శించిన వ్యక్తి పైకి స్థానికులు దూసుకెళ్లారు.వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

Last Updated : Dec 18, 2019, 12:31 PM IST

ABOUT THE AUTHOR

...view details