ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీజేఐ రాక కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్న అమరావతి రైతులు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికనై తర్వాత తొలిసారి రాష్ట్ర హైకోర్టుకు వస్తున్న జస్టిస్ ఎన్వీరమణకు అమరావతి రైతులు భారీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Amravati farmers making huge arrangements for CJI arrival
సీజేఐ రాక కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్న అమరావతి రైతులు

By

Published : Dec 26, 2021, 11:04 AM IST

Updated : Dec 26, 2021, 2:18 PM IST

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తొలిసారి అమరావతికి వస్తున్న జస్టిస్ ఎన్వీ రమణకు స్వాగతం పలికేందుకు.. అమరావతి ఐకాస ఏర్పాట్లు చేస్తోంది. నేలపాడులోని హైకోర్టులో కార్యక్రమానికి హాజరయ్యేందుకు వస్తున్న సీజీఐకి రోడ్డుకు ఇరువైపులా నిలబడి స్వాగతం పలకనున్నారు. ఆకుపచ్చ కండువాలు, జాతీయ జెండాలతో సాదర స్వాగతం పలకాలని నిర్ణయించారు.

సీజేఐ రాక కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్న అమరావతి రైతులు

మందడం దీక్షా శిబిరంలో అమరావతి రైతు మహిళలు వేకువజామునుంచి పూల రెమ్మెలు ఒలుస్తున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్న తమకు న్యాయస్థానమే అండగా నిలిచిందని అందుకే కోర్టును దేవాలయంగా భావించి న్యాయమూర్తులను దేవతామూర్తులుగా పూజలు చేస్తున్నామని రైతులు తెలిపారు.

Last Updated : Dec 26, 2021, 2:18 PM IST

ABOUT THE AUTHOR

...view details